గణపయ్యకు నైవేద్యం.. భక్తులకు అన్నప్రసాదం.

సత్తుపల్లి మహాగణపతి సన్నిధిలో మంత్రి పొంగులేటి సేవాభక్తి.

గణపయ్యకు నైవేద్యం.. భక్తులకు అన్నప్రసాదం.

సత్తుపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సత్తుపల్లిలో భక్తిభావం వెల్లివిరిసింది. పట్టణంలోని శ్రీ మహాగణపతి ఆలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. గణపతి మాలధారణ చేసిన భక్తులకు మంత్రి స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తులతో కలిసి కొద్దిసేపు గడిపిన ఆయన ఉత్సవాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. మహాగణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.IMG-20260922-WA0017

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.