గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు సర్వం సిద్ధం.

గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు సర్వం సిద్ధం.

*రూ.1.50 కోట్లతో గతం కంటే ఘనంగా ఏర్పాట్లు*

*భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు: మేయర్ కొలగాని శ్రీనివాస్*

కరీంనగర్, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ):

 నగరంలో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఘనంగా రూ.1.50 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.

భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. టవర్ సర్కిల్, రాంనగర్, కమాన్ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలు, గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద పూల అలంకరణలు, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ఏర్పాట్లు చేశారు.

కొత్తపల్లి, మానకొండూర్ చెరువులు, చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనానికి అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేశారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అవసరమైన సహకారం అందించాలని మేయర్ సూచించారు.

మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగరపాలక సంస్థ అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాన గణేష్ నిమజ్జన పాయింట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేయాలని, ప్రశాంతమైన వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించి కరీంనగర్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని మేయర్ పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.