ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్ష.
* పలు గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు
* అన్నదాన కార్యక్రమాలు ప్రారంభం
* ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు నిర్వహించుకోవాలని సూచన
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు )
విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
*పలు మండపాల్లో పూజలు*
కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, గురవాయిగూడెం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద మారుతినగర్, ఖమ్మం నగరంలోని బేడ జంగాల కాలనీ, శ్రీనగర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మంత్రి సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
*ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలి*
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లుగానే నిమజ్జన కార్యక్రమాలను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. భక్తులందరూ సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
*ఈ కార్యక్రమాల్లో..:* ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోక బత్తిని అనిత, వైస్‌చైర్మన్ తమ్మినేని నవీన్, కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బానోత్ కిషోర్, పలువురు సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments