ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం.

డాక్టర్ స్వరూప.

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం.

పెద్దమందడి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

ఆయుర్వేద డే సందర్భంగా పెద్దమందడి కస్తూర్బా పాఠశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయుర్వేదం ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం, సహజ ఆహారం, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ స్వరూప మాట్లాడుతూ.. భారతదేశ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణలో విశిష్టమైన పాత్ర పోషిస్తోందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రోజువారీ జీవితంలో ఆయుర్వేద విధానాలను పాటించడం వల్ల ఆరోగ్యంపై అవగాహనపెంపొందించుకోవచ్చని వివరించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో యోగ వాక్ నిర్వహించారు. అనంతరం ఔషధ మొక్కల ఉపయోగాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆయుర్వేద విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఫార్మసిస్ట్ శశిధర్, యోగా ఇన్‌స్పెక్టర్లు నరేష్, స్వాతి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.