నగరపాలక సంస్థలో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు.
*మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు*
*ఉద్యోగులు, సిబ్బందితో కలిసి అన్నదానంలో పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్*
కరీంనగర్, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మేయర్ కొలగాని
శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మట్టి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణనాథుడికి అభిషేకం, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.విఘ్నేశ్వరుని ఆశీస్సులతో కరీంనగర్ నగరం సుభిక్షంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి స్వయంగా వడ్డన చేసి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments