అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న పోలీసులు.

వేలేరు, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
     
వేలేరు మండలం పీచర గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, పీచర గ్రామ శివారులో కొండాపూర్ గ్రామానికి చెందిన పుట్ట రాజు తనకు చెందిన ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్ చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ హెచ్చరించారు.
  

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.