శ్రీకృష్ణ యాదవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు .
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో శ్రీ కృష్ణ యాదవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు.
ముఖ్య అతిథులుగా ముల్కనూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉపసర్పంచ్ కాసగోని మమత బాలకృష్ణ, 8వ వార్డు సభ్యుడు సీహెచ్. అనిల్, 9వ వార్డు సభ్యుడు ముడికే భిక్షపతి, భీమదేవరపల్లి మండల యూత్ అధ్యక్షుడు జక్కుల అనిల్ హాజరయ్యారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అప్పని శిరీష, రెండో బహుమతి గిరబోయిన వినోద, మూడో బహుమతి ఆదరి అశ్విని అందుకున్నారు.
బహుమతులను ముడికే బాలరాజు, దొండ రాహుల్, బర్మా హరీష్ తదితరులు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శ్రీ కృష్ణ యాదవ యూత్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments