గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం.
Views: 61
On
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 550 మంది భక్తులు అన్నదాన తీర్థప్రసాదాలను స్వీకరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముల్కనూర్ ఎస్సై రాజు హాజరై వినాయక పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జక్కుల మల్లికార్జున్, వైస్ చైర్మన్ గిరబోయిన కుమారస్వామి, మాజీ చైర్మన్ జక్కుల ప్రకాశం, యాదవ సంఘం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Sep 2026 21:05:19
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...


Comments