కొత్తపెళ్లిలో 19 ఏళ్ల యువతి అదృశ్యం.. కేసు నమోదు.
Views: 379
On
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి సౌజన్య (19) అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం బొమ్మిశెట్టి స్వప్న, కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెప్టెంబర్ 21, 2026 రాత్రి సుమారు 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి ఇంట్లో నిద్రించారు. రాత్రి ఒంటిగంట సమయంలో స్వప్న లేచి చూడగా తన పెద్ద కుమార్తె సౌజన్య ఇంట్లో కనిపించలేదు.దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా సౌజన్య ఆచూకీ లభించలేదు. దీంతో సౌజన్య తల్లి బొమ్మిశెట్టి స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Sep 2026 21:05:19
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...


Comments