పాత డిగ్రీ కళాశాల భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌గా వినియోగించాలి.

పాత డిగ్రీ కళాశాల భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌గా వినియోగించాలి.

* విద్యార్థులకు వసతి కల్పించాలి లేదంటే ఆందోళనకు పిలుపునిస్తాం

* ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు

జమ్మికుంట, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

 జమ్మికుంటలో నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌ కోసం వినియోగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని సందర్శించిన ఆయన, భవనం పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పెద్దగా దెబ్బతినకుండా అందుబాటులో ఉన్నప్పటికీ కళాశాలను ఎందుకు మూసివేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. ప్రస్తుతం సరైన హాస్టల్‌ వసతి లేక దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని వెంటనే విద్యార్థుల హాస్టల్‌గా మార్చి వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
విద్యార్థుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్‌ఎఫ్‌డీ కో-కన్వీనర్‌ గోస్కుల అజయ్‌, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్‌, రోహిత్‌, ఆఫ్రిద్‌, మోయిస్‌, సల్మాన్‌, రిషికేష్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.