ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
దానం నాగేందర్‌ను కలిసిన దయ్యాల దాసు.
వనపర్తి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ మంత్రి దానం నాగేందర్‌ను సీనియర్ నాయకులు దయ్యాల దాసు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే విధానం తదితర అంశాలపై వారు సమాలోచనలు జరిపారు.ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. దేనికైనా రెడీ.. ఎన్నికలు మనకేం కొత్త కాదు. ఫైట్ చేయడం మనకేం కొత్త కాదు. మనం ప్రజల గుండెల్లో ఉన్నాం. ప్రజలు మన వెంట ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి మన సత్తా ఏంటో చూపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు దయ్యాల దాసు, నాగేష్ సాగర్, గద్దల ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments