సెప్టెంబర్‌ 27న చలో యాదాద్రి.

కరీంనగర్‌ జిల్లా నుంచి వెయ్యి మంది ఉద్యమకారులను సమీకరించాలి.

సెప్టెంబర్‌ 27న చలో యాదాద్రి.

ఇల్లంతకుంట, సెప్టెంబర్‌ 22 (తెలంగాణ ముచ్చట్లు): 

ఈ నెల 27న యాదాద్రిలో నిర్వహించనున్న చలో యాదాద్రి కార్యక్రమానికి కరీంనగర్‌ జిల్లా నుంచి వెయ్యి మంది ఉద్యమకారులు తరలిరావాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో కార్యక్రమంపై చర్చించారు.
ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. చలో యాదాద్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువత, విద్యార్థులు, మహిళలు, కళాకారులు, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి వచ్చే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బిజ్జిగిరి షరీఫ్‌, జమ్మికుంట, ఉప్పల్‌, కాజీపేట ప్రాంతాల నుంచి ఉద్యమకారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరులు, గాయపడిన వారు, కేసులు ఎదుర్కొన్నవారు, జైలు జీవితం గడిపినవారు, యువత, విద్యార్థులు, మహిళలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, రైతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ నెల 27న యాదాద్రిలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ గుండేటి ఐలయ్య, నియోజకవర్గ కన్వీనర్‌ ఆరె రమేష్‌రెడ్డి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కుమారస్వామి, సర్పంచ్‌లు కొండ అర్జున్‌, జక్కే కిరణ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గూడెపు సారంగపాణి, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెద్ది కుమార్‌, జమ్మికుంట టౌన్‌ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు రావుల రాజబాబు, జమ్మికుంట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాకాల మల్లారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు మంకాలి రమ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.