ఏదులాపురం ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి.
* నాణ్యతలో రాజీ పడొద్దు
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనుల ఆకస్మిక తనిఖీ
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు )
ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తరుణీ హట్ ప్రాంగణంలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట లభిస్తాయని, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. *ఈ కార్యక్రమంలో* ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments