ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యం.!
- విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, సెప్టెంబరు 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయా వర్గాలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, హక్కుల పరిరక్షణ, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సక్రమంగా చేరేలా పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారం చూపేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments