గ్రాడ్యుయేట్లంతా ఓటు నమోదు చేసుకోవాలి.

సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్.

గ్రాడ్యుయేట్లంతా ఓటు నమోదు చేసుకోవాలి.

వనపర్తి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు 2027 మార్చిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.నవంబర్ 1, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన పట్టభద్రులు ఓటు నమోదుకు అర్హులని పేర్కొన్నారు. గతంలో ఓటు ఉన్నవారు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఫారం-18 ద్వారా నవంబర్ 6, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.డిగ్రీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ తదితర అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పట్టభద్రులందరూ బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకుని, ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయాలని శంకర్ గౌడ్ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.