క్రీడలతో క్రమశిక్షణ పెంపొందుతుంది.
ప్రధానోపాధ్యాయులు శాంతన్న.
పెద్దమందడి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
క్రీడలు విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడలతో క్రమశిక్షణ పెంపొందుతుందని పెద్దమందడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న అన్నారు. మంగళవారం మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు సమయపాలన, పట్టుదల, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి వంటి మంచి లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. క్రీడలు విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు ఓటమిని స్వీకరించి తిరిగి విజయం సాధించేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.మండల స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన శాంతన్న, ప్రతిభను చాటుతూ ఉన్నత స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


Comments