నాయిని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.

నాయిని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.

జమ్మికుంట, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలో నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుల నిమజ్జనానికి నాయిని చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మంగళవారం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించిన భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అదే భక్తి భావంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు, భక్తులు సమయానుకూలంగా బయలుదేరి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసుకోవాలని కోరారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారులకు, పోలీసులకు సహకరించాలని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు పొనగంటి విష్ణు, పొనగంటి రాము, పట్టణసీఐ రామకృష్ణ, ఏఈ వికాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.IMG-20260922-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.