పెద్దమందడిలో అట్టహాసంగా మండల స్థాయి క్రీడా పోటీలు.

పెద్దమందడిలో అట్టహాసంగా మండల స్థాయి క్రీడా పోటీలు.

క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

-- మండల విద్యాధికారి మంజులత

పెద్దమందడి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండల విద్యాధికారి మంజులత క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల  విద్యాధికారి మంజులత మాట్లాడుతూ.. క్రీడల్లో చురుకుగా పాల్గొని రాణించే విద్యార్థులు చదువుల్లోనూ ముందుంటారని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా దానిని ఒక పాఠంగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని మంజులత సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు.మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని విద్యార్థులకు IMG-20260922-WA0002ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పరిణత,గ్రామ సర్పంచ్ సూర్య గంగా,వార్డు సభ్యులు సింగిరెడ్డి అమలా కురుమూర్తి, ప్రధానోపాధ్యాయులు శాంతన్న,ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.