జమ్మికుంట మార్కెట్‌లో కొత్త పత్తి కొనుగోళ్లు.

జమ్మికుంట మార్కెట్‌లో కొత్త పత్తి కొనుగోళ్లు.

జమ్మికుంట, సెప్టెంబర్‌ 22 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కొత్త పత్తి కొనుగోళ్లకు మంగళవారం శ్రీకారం చుట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన కొత్త పత్తికి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న సదానందం ముహూర్తం చేసి కొబ్బరికాయలు కొట్టారు. కొత్త పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.
మొదటి రోజు జరిగిన బహిరంగ వేలంపాటలో కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.7,272, కనిష్ఠంగా రూ.7,011 ధర లభించింది. మురళీకృష్ణ ట్రేడర్స్‌, మల్లికార్జున ట్రేడర్స్‌ పత్తిని కొనుగోలు చేశారు. ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామానికి చెందిన కలాల గణపతిరెడ్డి, పైండ్ల తిరుపతిరెడ్డి, సిరిసేడు గ్రామానికి చెందిన బీనవేని కొమురయ్య కొత్త పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతుల్లో ఉన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ, జమ్మికుంట మార్కెట్‌లో లైసెన్స్‌ పొందిన వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన లైసెన్స్‌ పొందిన వ్యాపారులు కూడా పత్తి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు రావచ్చని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు మార్కెట్‌ పాలకవర్గం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని పేర్కొన్నారు.
రైతులు పండించిన పత్తిని నేరుగా మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం ద్వారా మంచి ధర పొందాలని సూచించారు. గ్రామాల్లో దళారులను నమ్మి నష్టపోకుండా మార్కెట్‌ యార్డులోనే పత్తిని విక్రయించుకోవాలని ఆమె కోరారు.
కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి ఆర్‌.మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్‌.రాజా, మార్కెట్‌ కమిటీ గౌరవ సభ్యులు, సిబ్బంది, అడ్తిదారులు, వ్యాపారులు, రైతులు, గుమాస్తాలు, హమాలీలు, దాడువాయి కార్మికులు, దాడువాయి సంఘం అధ్యక్షుడు ఎరబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం.. గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదానం..
ముల్కనూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): గణపతి నవరాత్రుల సందర్భంగా ముల్కనూర్ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా...
ప్రజలే మన బలం.. గెలిచి మన సత్తా చూపిస్తాం.
జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
కాంగ్రెస్ పట్టణ అధికార ప్రతినిధిగా పోశాల కృష్ణమూర్తి.