కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.

కొత్తపల్లి నూతన నిమజ్జన పాయింట్‌ను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.

కరీంనగర్, సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు, భజనలు, విశేష అభిషేకాలతో కొలువుదీరిన గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్తపల్లి నూతన గణేష్ నిమజ్జన పాయింట్‌లో నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

నూతన నిమజ్జన పాయింట్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శోభాయాత్రగా తరలివచ్చిన తొలి గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసి విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

నగరంలో నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారుIMG-20260923-WA0003

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.