జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.

మరకంటి నరసింహకు జాషువా సాహిత్య పురస్కారం.

జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
మర్రికంటి నరసింహ

వనపర్తి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

మహాకవి గుర్రం జాషువా తన కవిత్వంతో తెలుగు సమాజంలో సామాజిక చైతన్యాన్ని రగిలించారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జాషువా 131వ జయంతి వేడుకలను ఈ నెల 29న మంగళవారం సాయంత్రం 5 గంటలకు వనపర్తి పట్టణంలోని ఎం.ఎన్.ఆర్. బ్యాంకెట్ హాల్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోయి కోటేశ్వర్ రావు ప్రధాన వక్తగా హాజరుకానుండగా, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆత్మీయ అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా వనపర్తికి చెందిన ప్రముఖ వచన కవి మరకంటి నరసింహకు ‘గుర్రం జాషువా సాహిత్య పురస్కారం’ను ప్రదానం చేయనున్నట్లు శంకర్ గౌడ్ వెల్లడించారు.జాషువా రచనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయన సాహిత్యంలో ప్రతిబింబించిన సామాజిక చైతన్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. జయంతి వేడుకలకు జిల్లాలోని కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.