మానకొండూర్‌లో వైభవంగా గణేష్ నిమజ్జనం

మానకొండూర్‌లో వైభవంగా గణేష్ నిమజ్జనం

*భక్తిశ్రద్ధల మధ్య గణపతి బప్పా మోరియా నినాదాలు*

*డప్పు వాయిద్యాలు, భజనల మధ్య ఘనంగా శోభాయాత్ర. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు*

*నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ*

మానకొండూర్, సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువు కట్టపై గణపతి నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. మానకొండూర్ క్యాంప్ కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడిని ఘనంగా శోభాయాత్రగా తీసుకువచ్చి చెరువు కట్ట వద్ద నిమజ్జనం చేశారు.

మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం హాజరయ్యారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అధికారుల సమన్వయంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, చెరువు నీటిమట్టం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు నిమజ్జన కార్యక్రమానికి తరలివచ్చారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగగా, డప్పు వాయిద్యాలు, భజనల మధ్య గణనాథుడిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ప్రజల ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల పండుగలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం స్థానిక అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలు సIMG-20260923-WA0014జావుగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలను అధికారులు పర్యవేక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.