పద్మశాలి ఐక్యతకు అభినందనీయ నిర్ణయం.

పద్మశాలి ఐక్యతకు అభినందనీయ నిర్ణయం.

* ఎన్.ఎం. రమేష్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకోగా

* అరకాల వీరేశలింగం ఏకగ్రీవ ఎన్నిక

జమ్మికుంట, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పద్మశాలి సేవా సమితి, పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో పద్మశాలి ఐక్యతకు ప్రతీకగా అభినందనీయ పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అరకాల వీరేశలింగం, ఎన్.ఎం. రమేష్‌లలో ఎన్.ఎం. రమేష్ స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుని, అరకాల వీరేశలింగానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ సమర్పించారు. దీంతో అరకాల వీరేశలింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ.. పద్మశాలి సమాజ ఐక్యత కోసం ఎన్.ఎం. రమేష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. పద్మశాలి కులబంధవులతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. తన కుటుంబాన్ని రెండు పర్యాయాలు గెలిపించడంలో పద్మశాలి కులబంధవుల సహకారం ఎంతో ఉందని, ప్రస్తుతం 23వ వార్డులో తన గెలుపులోనూ వారి పాత్ర కీలకమైందని పేర్కొన్నారు.
పద్మశాలి సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అరకాల వీరేశలింగానికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దిడ్డీ రాము, అభ్యర్థి ఎన్.ఎం. రమేష్, కొండ శ్రీధర్, కొండి రమేష్‌తో పాటు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.