హాస్టళ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.!

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే రాగమయి వినతి.

హాస్టళ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.!

సత్తుపల్లి, సెప్టెంబరు 23 (తెలంగాణ ముచ్చట్లు):

నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌ కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్ల పరిసరాల్లో సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.