రంగరాయిగూడెంలో సోలార్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే.
పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మరిన్ని సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఘన్‌పూర్ ఉపవిభాగం పరిధిలోని రంగరాయిగూడెం గ్రామంలో నిర్వాహకులు నెలవంచ అజయ్‌కుమార్ నిర్మించిన రెండు మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సౌర విద్యుత్ కేంద్రాల ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రత్యామ్నాయ విద్యుత్ వనరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరాపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో నిర్వాహకులకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తోందని, ఘన్‌పూర్ ఉపవిభాగం పరిధిలో మరిన్ని సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ ప్లాంట్ ద్వారా ప్రతి నెల సుమారు 1.80 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ప్రాజెక్టు అభివృద్ధిదారు అజయ్‌రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, రంగరాయిగూడెం, కోమటిగూడెం సర్పంచులు జూ
లకుంట్ల శిరీష్‌రెడ్డి, కత్తుల సోమన్న యాదవ్, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, ట్విలైట్ సోలార్ సంస్థ డైరెక్టర్లు ప్రభాకర్, శివకుమార్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments