మంగంపల్లిలో కబడ్డీ సందడి.

ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 పోటీల్లో 15 మండలాల జట్లు.

మంగంపల్లిలో కబడ్డీ సందడి.

పెద్దమందడి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం  మంగంపల్లి గ్రామంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్‌-17 కబడ్డీ పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా పరిధిలోని 15 మండలాలకు చెందిన బాలబాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఘణపూర్, గోపాల్‌పేట, కొత్తకోట, పానగల్, పెబ్బేరు, పెద్దమందడి, మదనాపూర్, రేవల్లి, వనపర్తి, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, ఏదుల మండలాల జట్లు పోటీల్లో తలపడ్డాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటూ హోరాహోరీగా పోటీ పడ్డారు.ఖిల్లా ఘణపూర్‌ మండల పీఈటీ చిట్టెమ్మ సమన్వయంతో పోటీలు నిర్వహించారు. ఆయా మండలాలకు చెందిన పీడీలు, క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ పోటీలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. కబడ్డీ వంటి జట్టు క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, సమన్వయం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.మంగంపల్లి వేదికగా నిర్వహించిన ఈ పోటీలు జిల్లాలో పాఠశాల స్థాయి క్రీడలకు ప్రోత్సాహం అందించడంతో పాటు భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని అన్నారు.కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ ఇన్‌చార్జి కుమార్, స్థానిక సర్పంచ్‌ రమేష్‌ నాయక్, గ్రామ పెద్ద వెంకటరామిరెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో పరిణితి, రాఘవేందర్, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, 15 మండలాల పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.