మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.

కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా.

మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.

సైదాపూర్ : సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):

హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుందేళ్ల కనకమ్మ, అప్పిడి సుభద్ర, బోరగల్ల పోచమ్మ కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. అనంతరం సైదాపూర్‌లో అనగొని రవీందర్ గౌడ్, మొలగూరి వసంత కుటుంబాలను, సోమారం గ్రామంలో కోల లావణ్య, బూడిద వీరమ్మ కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దుఃఖంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ పర్యటనలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాడ కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, జిల్లా సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ , ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ సెల్ అధ్యక్షులు, సోషల్ మీడియా విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.