మంగంపల్లిలో జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలు.

మదనాపూర్, ఘనపూర్ జట్లకు ప్రథమ బహుమతులు.

మంగంపల్లిలో జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలు.

పెద్దమందడి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌-17 కబడ్డీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. జిల్లాలోని 15 మండలాలకు చెందిన బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.బాలుర విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో మదనాపూర్ జట్టు ప్రథమ బహుమతి సాధించగా, కొత్తకోట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ఘనపూర్ జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకోగా, పెబ్బేరు జట్టు ద్వితీయ బహుమతి సాధించింది.అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఘనపూర్, గోపాల్‌పేట, కొత్తకోట, పానగల్, పెబ్బేరు, పెద్దమందడి, మదనాపూర్, రేవల్లి, వనపర్తి, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, ఏదుల మండలాలకు చెందిన అండర్‌-17 విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి క్రీడా పోటీలకు సహాయ సహకారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.పోటీలను 15 మండలాల పీడీల పర్యవేక్షణలో ఖిల్లా ఘణపురం మండలం పీఈటీ చిట్టెమ్మ సమన్వయంతో నిర్వహించారు. 15 మండలాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. పోటీల నిర్వహణలో క్రీడా ఉపాధ్యాయులు, పీడీలు సమన్వయంతో వ్యవహరించారు.కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ ఇన్‌చార్జి కుమార్, స్థానిక సర్పంచ్ రమేష్ నాయక్, గ్రామపెద్ద వెంకటరామిరెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో పరిణతి, రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 15 మండలాల పీడీలు, క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.