హుజురాబాద్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.
తొలి నిమజ్జనాన్ని ప్రారంభించిన చైర్‌పర్సన్ సుహాసిని.
హుజురాబాద్, సెప్టెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో తొలి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం భక్తులు గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయక విగ్రహాలను తరలిస్తూ భక్తులు “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేశారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు. మున్సిపల్ సిబ్బంది నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయి. పట్టణంలో మిగిలిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసారు.


Comments