పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.

అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు

ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పుట్టలమ్మకుంట చెరువు కట్ట వద్ద నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా ఎన్‌పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీని అందుబాటులో ఉంచారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఘన్‌పూర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నిమజ్జనం కోసం పట్టణ శివారులోని పుట్టలమ్మకుంట చెరువు కట్ట వద్ద వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

నిమజ్జన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఎన్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆలోచనల మేరకు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.పుట్టలమ్మకుంట చెరువుకట్ట వద్ద నిమజ్జన బందోబస్తు కోసం ఇప్పటికే ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా మరో ఫీడర్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేందుకు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీని సిద్ధంగా ఉంచారు.

ప్రకృతి వైపరీత్యాలు లేదా సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ ద్వారా ప్రత్యామ్నాయ సరఫరాను పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్ పగిడిముంతల శంకర్ పర్యవేక్షణలో సిబ్బంది నిమజ్జన ప్రాంతంలో అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు. పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్ వినూత్న ఏర్పాటు ఏఈ శంకర్ పర్యవేక్షణలో అప్రమత్తంగా విద్యుత్ సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.
మంగంపల్లిలో కబడ్డీ సందడి.
జాషువా సాహిత్యం సామాజిక చైతన్యానికి స్ఫూర్తి.
జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
భక్తిశ్రద్ధల మధ్య నగరపాలక సంస్థ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.