కాజీపేట్ లో తల్లినిగొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయం .
అక్రమ సంబంధమే కారణం అంటున్న కుటుంబీకులు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిసిపి, ఏసిపి
కాజీపేట్ సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ బాలాజీ నగర్ లో మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ నగర్ లో నాగుల సుధాకర్ ఉదయ్ శ్రీ దంపతుకు ఒక కుమారుడు కూతురు లతోపాటు సుధాకర్ తల్లి గత కొద్ది సంవత్సరాలుగా నివాసముంటున్నట్టు వారు తెలిపారు. నాగుల సుధాకర్ కు 22 ఏళ్ల క్రితం మంచిర్యాలకు చెందిన ఉదయ్ శ్రీ తో వివాహం జరిగిందని వారు తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు కొడుకు దొరబాబు స్థానిక కాలేజీలో బి బి ఎం, కూతురు పదవ తరగతి చదువుతున్నదని అన్నారు. సుధాకర్ ప్రైవేట్ కోచ్ అటెండర్ గా పనిచేస్తున్నారు. ఉదయశ్రీ ఇంటి వద్దనే ఉంటూ ఇంస్టాగ్రామ్ లో రిల్స్ చేస్తుండదని కుటుంబీకులు తెలిపారు. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది అని స్థానికులు తెలిపారు. ఉదయ్ శ్రీ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గత కొంతకాలంగా అప్పుడప్పుడు బాలాజీ నగర్ కు వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు దీంతో వారిద్దరు వేరే కాపురం పెట్టుకుని బతుకుదామని అనుకున్నారు అని స్థానికులు తెలిపారు. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత ఇంట్లో అందరికి చెప్పి బయటకు రమ్మని ప్రియుడు చెప్పడంతో ఉదయ్ శ్రీ అదే విధంగా ఇంట్లో వాళ్లకు చెప్పి గురువారం ఉదయం బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిందని వారు తెలిపారు. ఈ విషయం కుమారుడు దొరబాబు కు తెలియడంతో ఇంట్లో బెడ్ రూమ్ లోకి వెళ్లి మాట్లాడకుండామని తల్లికి చెప్పి గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నారని కుటుంబీకులు తెలిపారు. అక్రమ సంబంధం వద్దని తల్లి ఉదయశ్రీకి ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు కొడుకు చెప్పిన మాటలు తల్లి వినకపోవడంతో కోపానికి గురైన కొడుకు దొరబాబు అక్కడే ఉన్న కత్తితో తల్లి గొంతు కోశాడని వారు తెలిపారు. కొంతసేపటి తర్వాత గదిలో నుంచి బయటికి వచ్చిన కొడుకు దొరబాబు తల్లిని గొంతు కోసి చంపాననీ కుటుంబ సభ్యులకు తెలిపాడని వాళ్ళు పేర్కొన్నారు. హత్య జరిగిన విషయం ఇరుగుపొరుగు వాళ్లకు తెలియడంతో నిందితుడు దొరబాబు ఇంట్లో నుంచి ఎటో పోయినట్టు కుటుంబీకులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్థానిక సిఐ శ్యాంసుందర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో డీసీపీ దార కవిత ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి హత్యజరగడానికి కారణాలను ఆరా తీశారు.


Comments