భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలి

ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి

హన్మకొండ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.మండలాల వారీగా వర్షపాతం, చెరువులు, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితిపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో వర్షాల సమయంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వేలేరు, ఆత్మకూరు మండలాల్లో బుధవారం అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాగులు, వంకలు పొంగి రహదారులపైకి వరద నీరు వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు.

అవసరమైన చోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని, చెరువుల్లో నీటిమట్టం, నీటి ప్రవాహాన్ని సాగునీటి శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వెంటనే తొలగించి ప్రధాన నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలు, ఇతర యంత్రాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.భారీ వర్షాల సమయంలో అధికారులు తమ పరిధిలోనే అందుబాటులో ఉండి, సమస్య తలెత్తిన వెంటనే క్షేత్రస్థాయిలో స్పందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నియంత్రణ గదిలో అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.

రహదారులు, వాగులు, వంకలు, చెరువులు, మురుగునీటి కాలువలపై నిరంతరం నిఘా ఉంచాలని, వర్షాల కారణంగా ఎక్కడైనా నష్టం జరిగితే వెంటనే వివరాలు అందజేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్ వెంకన్న, జడ్పీ సీఈఓ శేషాద్రి, పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్, సాగునీటి శాఖ ఈఈ మంగీలాల్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలి ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి హన్మకొండ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):  జిల్లాలో భారీ వర్షాలు...
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.
బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.
కడియం అభివృద్ధిపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్.
పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.