నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష

కరీంనగర్, సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు ):

ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణం, జిల్లా కలెక్టర్ ఛాంబర్‌తో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ప్రారంభోత్సవం అనంతరం నూతన కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేIMG-20260924-WA0018యాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రతి ఏర్పాటును ముందుగానే పూర్తి చేసి, పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ తదితర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలి ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి హన్మకొండ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):  జిల్లాలో భారీ వర్షాలు...
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.
బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.
కడియం అభివృద్ధిపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్.
పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.