చంద్రుపట్ల ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్, షూస్ పంపిణీ.
Views: 0
On
వాజేడు, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
చంద్రుపట్ల ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్స్, షూస్, సాక్సులు, బెల్టులను సర్పంచ్ అనుముల సంధ్యారాణి, పాఠశాల కమిటీ చైర్మన్ గట్టి లలిత చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సంతోష్ మాట్లా
డుతూ ఉచిత యూనిఫామ్స్, ఇతర సామగ్రి అందించడం వల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందడంతో పాటు నూతనోత్సాహం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Sep 2026 22:14:18
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...


Comments