సాయిబాబా ఆలయంలో అన్నదానం.

అన్నదాన కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు.

సాయిబాబా ఆలయంలో అన్నదానం.

హుజురాబాద్,సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు ):

పట్టణంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంపటి సదానందం ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించిన వారు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా అన్నదాత మావూరి ప్రవీణ్ కుమార్‌ను ఆలయ కమిటీ సభ్యులు, బీసీ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు.
అన్నదాతలను అభినందించిన జనార్ధన్
ఈ సందర్భంగా చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ హుజురాబాద్ సాయిబాబా ఆలయంలో ప్రతి గురువారం భక్తులు, ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న మావూరి ప్రవీణ్ కుమార్, ప్రణీత శ్రీయాన్ కుటుంబ సభ్యులతో పాటు కొలిపాక శంకర్, లలిత కుటుంబ సభ్యులను అభినందించారు.
భక్తి భావంతో సాయిబాబా దర్శనం
షిరిడీ సాయిబాబా అనుగ్రహంతో హుజురాబాద్ పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని సాయినాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు జనార్ధన్ తెలిపారు.
ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు
ప్రజలందరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, సేవా భావంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ‘మన కోసం మనం.. మనందరి కోసం మనం’ అనే భావనతో స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి జీవించాలని సూచించారు. ఆలయంలో జరుగుతున్న అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
అన్నదాన కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వరుణ్ శర్మ, వైస్ చైర్మన్ ఇనుగాల సత్తిబాబు, బీసీ సంక్షేమ జాతీయ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని, జేఏసీ నాయకులు కొలిపాక క్రాంతికుమార్, చిలుకమారి శ్రీనివాస్, మంచికట్ల రమేష్, నడిగోటి రమేష్ తదితరులు పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.