విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర.

పలుస శంకర్ గౌడ్ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు.

విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర.

వనపర్తి,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమంలో పాట, ఆట, మాటలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతర పోస్టర్‌ను సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ బుధవారం వనపర్తిలో విడుదల చేశారు.హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపం, అరుణోదయ నాగన్న ప్రాంగణంలో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో ఈ ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటలకు సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు డోరేగింపు నిర్వహించి, ఉదయం 9:45 గంటలకు జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా పాట, ఆట, మాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ తెలంగాణ ఉద్యమానికి విమలక్క తన కళతో ఊపిరిపోశారని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల నుంచి వందలాది మంది కళాకారులు ఈ 50 గంటల ప్రజా కళా జాతరలో పాల్గొని తమ కళారూపాలను ప్రదర్శించనున్నారని తెలిపారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 52 ఏళ్ల పోరాట చరిత్రను, విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని యువతరానికి తెలియజేయడమే ఈ జాతర ప్రధాన లక్ష్యమని అన్నారు. వనపర్తి జిల్లా నుంచి కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో కవి జనజ్వాలా బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శాం సుందర్, గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్, దేశి రాములు, బుచ్చిబాబు, సాహితీ కళా వేదిక నాయకులు, స్థానిక కళాకారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.