కూలిన వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా.

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచన..

కూలిన వంతెనను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా.

ములకలపల్లి, సెప్టెంబరు 24 (తెలంగాణ ముచ్చట్లు): 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట వద్ద బుధవారం రాత్రి వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు కూలిన వంతెనను పరిశీలించారు. వంతెన కూలిపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన పరిశీలించి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కంపగూడెం వైపు వెళ్లే మార్గంతో పాటు మాధారం వైపు ఉన్న రహదారులు కూడా అధ్వానంగా ఉన్నందున వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరారు. కూలిన వంతెన స్థానంలో శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వంతెన పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, సెనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, పుష్పాల చందర్‌రావు, కొండవీటి చంద్రశేఖర్, సునీల్, సున్నం బాబూరావు, పుష్పాల హనుమంత్, మాజీ మండల యువజన విభాగం అధ్యIMG-20260924-WA0054క్షుడు తాటి ప్రవీణ్, సిద్దెల వెంకటేష్, శేషు, పుష్పాల సాయి, కంపాటి సొందు, నల్లబెల్లి వెంకటేశ్వర్లు, బొర్రా రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.