వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.

రూ.37,516లకు దక్కిన లడ్డూ ప్రసాదం.

వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు): 

పద్మశాలి కాలనీ–హనుమాన్ల గడ్డ వద్ద శ్రీ గణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో నాగిళ్ల అరుణ్‌కుమార్–జయంతి దంపతులు రూ.37,516లకు లడ్డూను దక్కించుకున్నారు.

గత రెండేళ్లుగా లడ్డూను దక్కించుకున్న ఈ దంపతులు, ఈ ఏడాది కూడా వేలంలో గెలిచి వరుసగా మూడోసారి గణపతి లడ్డూను కైవసం చేసుకోవడం విశేషం. అనంతరం నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు దంపతులను శాలువాలతో సత్కరించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.