సూరవీడు సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెన్షన్.
Views: 4
On
ములుగు/నూగూరు వెంకటాపురం, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని సూరవీడు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత సహదేవరావు ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సూరవీడు పంచాయతీ వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు.
విచారణలో పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సూరవీడు సర్పంచ్ ఎర్రప మురళి, ఉప సర్పంచ్ కె. మురళిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Sep 2026 22:14:18
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...


Comments