*కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు.

*కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు.

*చివరి విగ్రహం వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ.*

*అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు*

*సహకరించిన ప్రతి ఒక్కరికీ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కృతజ్ఞతలు*

కరీంనగర్, సెప్టెంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు ):

నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా ముగిశాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కరీంనగర్‌లో నిమజ్జన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు అందించారని వెల్లడించారు.

నగరవ్యాప్తంగా సుమారు 2,300 గణేష్ విగ్రహాలు చింతకుంట, మానకొండూర్, కొత్తపల్లి తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో ప్రశాంతంగా నిమజ్జనం చేసినట్లు సునీల్ రావు తెలిపారు. వర్షం కారణంగా భక్తులకు, మండపాల నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు.

నిమజ్జన ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి విగ్రహం వరకు మేయర్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించినట్లు తెలిపారు. పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేసిన అధికారులు, సిబ్బంది సేవలను అభినందించారు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణలో కృషి చేసిన జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా విజయవంతం కావడానికి సహకరించిన నగర ప్రజలు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల ప్రతినిధులకు బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.