మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆపన్నహస్తం.

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆపన్నహస్తం.

పెద్దమందడి,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన బండపల్లి బాలకిష్టమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మణిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా బాలకిష్టమ్మ మృతదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దహన సంస్కారాల నిర్వహణకు కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు.బాలకిష్టమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన వంతు సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పోతుల రాంరెడ్డి, గర్రెమోని బాలరాజు, వెంకటయ్య, కోములయ్య, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, రాములు, సింగం వెంకటయ్య, బోయిన్ కృష్ణ తదితరులు పాల్గొని బాలకిష్టమ్మ మృతికి సంతాపం తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్  గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):  చిల్పూర్  బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ...
విద్యా రంగానికి తాళ్ల మల్లేశం సేవలు చిరస్మరణీయం.
వరుసగా మూడోసారి గణపతి లడ్డూ నాగిళ్ల దంపతులకే.
ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
చిల్పూర్ బుగులు వెంకన్న హుండీ లెక్కింపు వాయిదా.
సాయిబాబా ఆలయంలో అన్నదానం.
హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు.