నేరెళ్ల శారదను మర్యాదపూర్వకంగా కలిసిన దేవస్థానం చైర్మన్.

నేరెళ్ల శారదను మర్యాదపూర్వకంగా కలిసిన దేవస్థానం చైర్మన్.

ఇల్లంతకుంట, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో గురువారం జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనంతరం నేరెళ్ల శారదను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున మెమొంటోతో పాటు ముత్యాల తలంబ్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానానికి సంబంధించిన మెమొంటో, ముత్యాల తలంబ్రాలను చైర్మన్ ఇంగిలే రామారావు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి మేకమల్ల అశోక్, మడిపల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల తిరుమల వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News