ఘనపూర్‌లో గణపయ్య ఊరేగింపు అదుర్స్!

ఘనపూర్‌లో గణపయ్య ఊరేగింపు అదుర్స్!

IMG-20260925-WA003720 అడుగుల వినాయకుడి నిమజ్జనానికి తరలివచ్చిన భక్తజనం

జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

డీజే మోత.. యువత నృత్యాలతో హోరెత్తిన వీధులు

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 4వ వార్డు గణనాథుడి నిమజ్జన ఊరేగింపు కనుల పండువగా సాగింది. 4వ వార్డులో జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేసిన 20 అడుగుల గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
నిమజ్జనం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గణనాథుడిని ప్రతిష్ఠించి మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. యువత డీజే పాటలకు నృత్యాలు చేస్తూ, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో సందడి చేశారు. మహిళలు, చిన్నారులు సైతం భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

దారి పొడవునా భక్తులు గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు సాగిన ప్రధాన వీధుల్లో భక్తుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.
నవరాత్రి ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు 4వ వార్డు కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో మొబైల్ చిత్ర ప్రదర్శన వాహనంపై ‘ఇరుముడి’ సినిమాను ప్రదర్శించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి కార్యక్రమాలతో పాటు వినోదాన్ని అందించడంతో ఈ మండపం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.అనంతరం స్థానిక జలాశయంలో జై హనుమాన్ యువజన సంఘం కమిటీ సభ్యులు గణనాథుడిని ఘనంగా నిమజ్జనం చేశారు. దీంతోపది రోజులుగా కొనసాగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.IMG-20260925-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News