వక్కల వెంకటస్వామికి టిఎంజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు.

వక్కల వెంకటస్వామికి టిఎంజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు.

హన్మకొండ,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు): 

హన్మకొండకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, అంబేద్కర్ ఫెలోషిప్, దళిత రత్న అవార్డుల గ్రహీత, వివేక సమయం దినపత్రిక సంపాదకుడు,డీజే4 కేబుల్ న్యూస్ ఛానల్ అధినేత వక్కల వెంకటస్వామిని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వక్కల వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, అణగారిన వర్గాల గొంతుకను సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు.తనకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫోరమ్ రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని వెంకటస్వామి పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News