స్టేషన్ ఘనపూర్‌లో రోడ్డు విస్తరణకు కసరత్తు.
ప్రతాప్ టెంట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు 30 అడుగుల మేర మార్కింగ్
ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ఆదేశం
స్టేషన్ ఘన్‌పూర్,సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ పనులకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతాప్ టెంట్ హౌస్ నుంచి డీసీబీ బ్యాంకు, పోలీస్‌స్టేషన్, తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా బస్టాండ్ వరకు రహదారి విస్తరణకు చర్యలు చేపట్టారు.ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ శుక్రవారం సిబ్బందితో కలిసి ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాలు, షెడ్లు, బోర్డులు, ఇతర ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా 30 అడుగుల మేర అధికారులు మార్కింగ్ చేశారు. మార్కింగ్ పరిధిలో ఉన్న నిర్మాణాలు, షెడ్లు, బోర్డులు, తాత్కాలిక దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించి మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు.రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు బస్టాండ్ పరిసర ప్రాంతంలో రద్దీ కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. మార్కింగ్ పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు సహకరించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Comments