డీజిల్ లోకో షెడ్ లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం .

డీజిల్ లోకో షెడ్ లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం .
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమములో పాల్గొన్న ఉద్యోగులు

కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

కాజీపేట జంక్షన్ పరిధి లోని రైల్వే డీజిల్ లోకో షెడ్ లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత హి సేవ లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ నుండి వచ్చిన శేఖర్ నుక్కాడ్ నాటక బృందం రైల్వే స్టేషన్, కార్యాలయాలు, షెడ్లు, జన సమూహాలలో పరిశుభ్రతపై అవగాహన కొరకు వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా డీజిల్ లోకో షెడ్ ఎడిఎంఈ రాజేష్ కుమార్, ఏ డి ఈ సతీష్, ఏసిఎంటి మల్లికార్జున హాజరై ఈ నాటకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో నుక్కడ్ నాటక బృంద సభ్యులు అన్వర్ హుస్సేన్, రవి, కిరణ్, మీనాక్షి, అంజి, ఆసిక, రమ్య, భార్గవి ,సుజాత, చాందిని లతోపాటు జానీమియా,  రాములసదానందం, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News