షూటింగ్ బాల్ జనగామ జిల్లా చైర్మన్‌గా గద్దె అనిల్ కుమార్.
జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక
జిల్లాలో షూటింగ్ బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తా: గద్దె అనిల్ కుమార్
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్‌గా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లుకు చెందిన గద్దె అనిల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఘన్‌పూర్ పట్టణంలో నిర్వహించిన షూటింగ్ బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించడంతో పాటు క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అనంతరం నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా గద్దె అనిల్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన అసోసియేషన్ అధ్యక్షుడు ఇనుగాల యుగేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లాలో షూటింగ్ బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.


Comments