పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు విట్టల్ రెడ్డి నివాళి.
అంత్యోదయ ఆశయ సాధనకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకం.
Views: 1
On
పెద్దమందడి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దమందడి మండల బీజేపీ నాయకులు విట్టల్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు కోటి కోటి నమస్సుమాంజలులు అర్పించారు.అంత్యోదయ ఆశయ సాధన కోసం పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషి చిరస్మరణీయమని విట్టల్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే లక్ష్యంగా ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్దమందడి మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Sep 2026 21:43:54
కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట జంక్షన్ పరిధి లోని రైల్వే డీజిల్ లోకో షెడ్ లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత...


Comments