గురుకుల విద్యార్థులకు కంటి వెలుగు.. 38 మందికి కళ్లద్దాల పంపిణీ.

గురుకుల విద్యార్థులకు కంటి వెలుగు.. 38 మందికి కళ్లద్దాల పంపిణీ.

జమ్మికుంట, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్షల్లో దృష్టిలోపాలను గుర్తించిన 38 మంది విద్యార్థులకు శుక్రవారం కళ్లద్దాలు అందజేశారు.
రెండు నెలల క్రితం ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో దృష్టిలోపాలు ఉన్న 38 మంది విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన కంటి అద్దాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ విద్యార్థులకు కళ్లద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రభుదాస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మంచి పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నిద్రపోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
కంటిలో ద్వంద్వ దృష్టి, మసకగా కనిపించడం, కళ్ల ఎర్రబడటం, కాంతి వెలుగులు కనిపించడం, కళ్లలో లేదా కనురెప్పల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విద్యార్థులు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి డాక్టర్ మొగిలి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని, ఫార్మసిస్ట్ పుష్పాంజలి తదితరులు పాల్గొన్నారు.IMG-20260925-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News