సరస్వతి ఎంటర్ప్రైజెస్‌లో భారీ అగ్ని ప్రమాదం.

రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం.

సరస్వతి ఎంటర్ప్రైజెస్‌లో భారీ అగ్ని ప్రమాదం.

హనుమకొండ, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా వడ్డేపల్లి జవహర్‌నగర్ క్రాస్‌లో భద్ర నాయక్‌కు చెందిన సరస్వతి ఎంటర్ప్రైజెస్ టైల్స్, మార్బుల్, గృహ నిర్మాణ సామగ్రి దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని టైల్స్, మార్బుల్‌తో పాటు ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే దుకాణంలోని సామగ్రి చాలావరకు పూర్తిగా కాలిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
గత పది సంవత్సరాలుగా కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థ కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో భద్ర నాయక్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అగ్ని ప్రమాదంతో తమ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న అఖిల భారత బంజారా సేవా సంఘం, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు భద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు సంఘాల నాయకులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని పరిగణనలోకి IMG-20260925-WA0003తీసుకుని భద్ర నాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News